TG Family Digital Card | తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ద‌ర‌ఖాస్తు..

TG Family Digital Card | తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ద‌ర‌ఖాస్తు.. ఈ నాలుగు ధృవ‌ప‌త్రాలు త‌ప్ప‌కుండా జ‌త ప‌ర‌చాల్సిందే..!

TG Family Digital Card | ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో ఒక కుటుంబం( Family )లోని వారు వివిధ ప‌థ‌కాల కింద వివిధ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను( Welfare Schemes ) పొందుతున్నారు. కానీ ఆ వివ‌రాల‌న్నీ ఒకే చోట లేవు. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు( Family Digital Card ) ను జారీ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ కార్డు జారీ చేయ‌డంతో ప్ర‌భుత్వానికి సంబంధించిన 30 శాఖ‌ల స‌మాచారం ఒకే చోట ల‌భించే వీలుంటుంది. అర్హుల‌కు కూడా త్వ‌ర‌గా సంక్షేమ ఫ‌లాలు అందే అవకాశం ఉంటుంది.

TG Family Digital Card | తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో అర్హులైన పేద‌లంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు( Welfare Schemes ) అందించేందుకు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) స‌ర్కార్ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ను( Family Digital Card ) రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల సికింద్రాబాద్ ప‌రిధిలోని కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల జారీ ప్ర‌క్రియ‌కు సంబంధించి పైల‌ట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ద‌ర‌ఖాస్తుల‌ను( Family Dogital Card Application ) కూడా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విడుద‌ల చేశారు. వ‌న్ స్టేట్ – వ‌న్ కార్డు( One State – One Card ) ఆలోచ‌న‌తో చేప‌ట్టిన ఈ బ‌హుళ ప్ర‌యోజ‌న కార్డుల జారీ ప్ర‌క్రియ‌ను ప్ర‌జ‌లంతా వినియోగించుకోవాల‌ని రేవంత్ పిలుపునిచ్చారు.

మార్పులు ఎప్పుడైనా చేసుకోవ‌చ్చు..
రేషన్ కార్డు( Ration Card ), ఆరోగ్యశ్రీ ( Arogya Sree ), రైతుబీమా( Rythu Bhima ), రైతు భరోసా( Rythu Bharosa ), షాదీ ముబారక్( Shadi Mubarak ), కల్యాణ లక్ష్మి( Kalyana Lakshmi ), ఆసరా పెన్షన్( Aasara Pensions ) వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు 30 శాఖలు 30 రకాలుగా సమాచారం సేకరించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయ‌ని సీఎం రేవంత్ తెలిపారు. అలా కాకుండా అర్హులైన వారందరూ ఒకే కార్డు ద్వారా ఈ సేవలు పొందడానికి వీలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డును అంద‌జేస్తామ‌ని, ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని సీఎం కోరారు. ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులో అవ‌స‌ర‌మైన మార్పులు ఎప్పుడైనా చేసుకోవ‌చ్చ‌న్నారు. ఒక్క క్లిక్‌తో కుటుంబ సమగ్ర సమాచారం ఉండాలన్న ఆలోచనతో ఈ విధానం తీసుకొచ్చామని చెప్పారు. ఒకసారి కార్డు పొందిన తర్వాత రేషన్‌తో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను ఎక్కడి నుంచైనా పొందడానికి వీలుంటుందని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ద‌ర‌ఖాస్తు న‌మూనా ఇదే..( Family Digiatl Card Application )
ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ద‌ర‌ఖాస్తు( Family Digiatl Card Application )ను మూడు భాగాలుగా విభ‌జించారు. మొద‌టి భాగంలో కుటుంబ పెద్ద వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది. అభ్య‌ర్థి పేరు, సెల్ నంబ‌ర్, రేష‌న్ కార్డు ర‌కం, పుట్టిన తేదీ, వార్షిక ఆదాయం, విద్యార్హ‌త‌లు, కులం, వృత్తి వంటి వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది. ఇక రెండో భాగంలో అభ్య‌ర్థి చిరునామా న‌మోదు చేయాల్సి ఉంటుంది.

మూడో భాగంగా చాలా ఇంపార్టెంట్..
మూడో భాగంలో కుటుంబ స‌భ్యుల వివ‌రాలు పొందుప‌రచాలి. ద‌ర‌ఖాస్తుదారునితో సంబంధం, పుట్టిన తేదీ, ఆధార్ నంబ‌ర్ వంటి వివ‌రాలు న‌మోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబ‌ర్, పుట్టిన తేదీల‌ను న‌మోదు చేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్క‌డ ఏ మాత్రం పొర‌పాటు జ‌రిగినా.. ఆ కుటుంబంలోని స‌భ్యుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌క‌పోవ‌చ్చు. కాబ‌ట్టి క‌రెక్ట్‌గా ఆధార్ నంబ‌ర్, పుట్టిన తేదీ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాలి. ద‌ర‌ఖాస్తుపై గ్రూప్ ఫొటో( Family Group Photo ) అతికించాల్సి ఉంటుంది. చివ‌ర‌గా ద‌ర‌ఖాస్తుదారుడు త‌న సంత‌కం చేయాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుకు జ‌త‌ప‌ర్చాల్సిన ధృవ‌ప‌త్రాలు ఇవే..
1. కుటుంబ పెద్ద ఆధార్ కార్డు
2. కుటుంబ స‌భ్యుల ఆధార్ కార్డులు
3. గ్రూప్ ఫొటో
4. బ‌ర్త్ స‌ర్టిఫికెట్స్(పిల్ల‌ల‌వి) త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment